గమనిక: ఈ ప్రసంగం వాక్యాన్ని బోధించడానికి ఒక ఆలోచన మాత్రమే, దీనిని పూర్తి ప్రసంగంగా భావించకండి. దేవుడు మిమ్మల్ని నడిపించిన రీతిలో, ఈ సందేశాన్ని మీకు వీలైన విధంగా మెరుగుపరచుకొని, దేవుని వాక్య సత్యాన్ని నమ్మకంతో బోధించడానికి సిద్ధపడండి.
"క్రీస్తు మన జీవితాలలో స్థలం కోరుకుంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నా, మన స్థితి ఏదైనా సరే, ఆయనకు మన హృదయాన్ని సమర్పిస్తే, ఆయన దానికి ఆత్మీయమైన విలువను అనుగ్రహిస్తాడు." ఈ క్రిస్మస్ పండుగ వేడుకల్లో క్రీస్తుకు స్థలం ఎక్కడ ఉంది?
పరిచయం
ఒక అతిథి మన ఇంటికి వస్తున్నప్పుడు, మనం ఎంత జాగ్రత్తగా అన్నిటినీ సిద్ధం చేసుకుంటామో ఆలోచించండి—ఇంటిని శుభ్రం చేస్తాం, భోజనం సిద్ధం చేస్తాం, ప్రతీది క్రమంగా ఉంచుతాం. అయితే మన జీవితాల గురించి ఏమంటారు? అత్యంత ప్రాముఖ్యమైన అతిథి అయిన యేసుక్రీస్తు కోసం మన జీవితంలో స్థలాన్ని సిద్ధంగా ఉంచుతున్నామా?
"మనం ఈ ప్రసంగ అంశం ద్వారా, ఈ క్రిస్మస్ సమయంలో మనం మన జీవితాలలో క్రీస్తుకు స్థానం ఎలా కల్పించాలి అనే సంగతులను 3 సంఘటనల నుండి ధ్యానించబోతున్నాం."
ప్రసంగం
1. మరియ: క్రీస్తు కొరకు సమర్పణ (పాత్రగా ఉండటానికి) - లూకా 1:27-38
- దేవుడు ఈ భూమిపై జన్మించడానికి పాత్రగా ఉంది.
- మరియ తన శరీరాన్ని దేవుని కార్యం కొరకు అర్పించుకుంది.
- ఆమె అవమానం కలిగించే పరిస్థితులను సైతం సహించింది.
- ఆమె సమర్పణ, విశ్వాసంతో, దేవుని దాసురాలిగా తాను సమర్పించుకుంది: "మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను" అని దేవునికి సమర్పించుకుంది.
ఆధ్యాత్మిక సందేశం: మనం క్రీస్తు కోసం మన జీవితాలను, శరీరాలను, పరువును అర్పించడానికి సిద్ధంగా ఉన్నామా? క్రీస్తుకు స్థలం ఇవ్వడం అంటే మన జీవితాల్ని పూర్తిగా ఆయనకు సమర్పించడమే.
2. యోసేపు: క్రీస్తు కొరకు సహనం (ప్రయాసలో, అవమానాలలో) - మత్తయి 1:18-25
- యోసేపు, దేవుని కొరకు సమాజ విమర్శలను ఎదుర్కొడానికి సిద్ధమయ్యాడు.
- అందరూ ఎం అనుకుంటారో అన్న ఆలోచన పక్కనపెట్టి, దేవుని రాకకై ప్రయాసపడ్డాడు.
- దేవుని మాటను విశ్వసించి, తన భార్య అయిన మరియను సంరక్షించాడు.
- ఆయన ఆత్మవిశ్వాసం, విధేయత దేవుని ప్రణాళికను జరిగించడానికి మార్గం చూపింది.
ఆధ్యాత్మిక సందేశం: మనం క్రీస్తు కోసం అవమానాలను లేదా కష్టాలను ఓర్పుతో భరిస్తామా? ఆయన పని కోసం మనం పడే ప్రయాసనే మనం ఆయనకు మన జీవితంలో స్థలం ఇవ్వడం.
3. పశువుల పాక: క్రీస్తు కొరకు స్థలం (దేవుడు ఉండటానికి) - లూకా 2:4-7
- యేసు పుట్టినప్పుడు ఆయనకు ఏ ఉన్నతమైన నివాసాలలో కూడా స్థలం దొరకలేదు.
- ఇటుకలతో కట్టిన అందమైన భవనాలలో, భంగళాలలో, రాజ సింహాసనాలలో, సమాజమందిరాలలో ఎక్కడ కూడా ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఆయన అటువంటి స్థలాలలో జన్మించలేదు.
- ఒక తక్కువ స్థాయి పశువుల పాక, ఆయన జన్మస్థలం అయ్యింది. పశువులు పరిశుద్ధుడైన దేవుని జనానాన్ని మొదటగా స్వయంగా చూసి ఎంత సంతోషించి ఉంటాయో! బహుశా అవి మాట్లాడి ఉంటే యిలా అనుంటాయేమో "సర్వలోక స్టృష్టికర్తను చూసే భాగ్యం మనకే దొరింకింది, ఆయన మన నివాసంలోకి వచ్చాడు ఉహ్హో! అంటూ సంబరపడుంటాయి.
- అది ఒక సాధారణమైన స్థలం, కానీ యేసు రాకతో విలువైనదిగా మారింది.
ఆధ్యాత్మిక సందేశం: నా హృదయంలో స్థలం ఉంది యేసుక్రీస్తు వస్తాడా అని అనుమానం వద్దు. యేసుక్రీస్తు వస్తాడు. నీ హృదయం పశువుల పాకలాగా అపవిత్రంగా ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, ఆయన రాకతో అది పవిత్రంగా, విలువైనదిగా మారుతుంది.
ముగింపు
క్రీస్తు కొరకు స్థలం సిద్ధం చేయాలంటే ఆసక్తి, ఆత్మీయ స్థిరత్వం, సమర్పణ కలిగి ఉండాలి.
- మరియ లాగా జీవితాన్ని సమర్పించుకుందాం.
- యోసేపు లాగా సహనాన్ని కలిగుందాం.
- పశువుల పాక లాగా మన హృదయాన్ని దేవుని నివాసంగా ఉంచుదాం.
➤ క్రీస్తు కొరకు నీ దగ్గర స్థలం ఉందా? ఉంటే ఆయనను నీ హృదయంలో జన్మించనివ్వు.
➤ క్రీస్తు కొరకు నీ దగ్గర స్థలం ఉందా? ఆయన అతిధిగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
%20(1).webp)