గమనిక: ఈ ప్రసంగం వాక్యాన్ని బోధించడానికి ఒక ఆలోచన మాత్రమే, దీనిని పూర్తి ప్రసంగంగా భావించకండి. దేవుడు మిమ్మల్ని నడిపించిన రీతిలో, ఈ సందేశాన్ని మీకు వీలైన విధంగా మెరుగుపరచుకొని, దేవుని వాక్య సత్యాన్ని నమ్మకంతో బోధించడానికి సిద్ధపడండి.
వాక్యభాగం: లూకా 2: 8-20
పరిచయం
క్రిస్మస్ అనేది ప్రపంచమంతటా సంబరంగా జరుపుకునే గొప్ప వేడుక. కానీ దీనిలోని ఆధ్యాత్మిక అర్థాన్ని చాలామంది అస్సలు గమనించరు. యేసు క్రీస్తు జన్మ మనకు దేవుని ప్రేమను, ఆయన అనుగ్రహించే రక్షణను స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు పుట్టుక "మహా సంతోషకరమైన సువర్తమానము"గా ప్రకటించబడింది.
ఈ శుభవార్తను మొదటిగా విని, గ్రహించిన వారు గొర్రెల కాపరులు. వారి స్పందనలో నుండి మనం చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటాం.
1. సుభవార్త వినడం (8-14)
- వారికి కొత్తగా ఎదురు ఎదురైన సంఘటన అది. ముందెన్నడూ దూతను చూసుండరు. అందుకే భయపడ్డారు కానీ ఆ వార్తను విన్నారు.
- రక్షకుడిని గురించి నిజమైన శుభవార్తను దూత ద్వారా ప్రకటించబడ్డారు. అది సంతోషకరమైన వార్త, సమాధానమును కలిగించే వార్త.
- నిజమైన రక్షకున్ని తెలుసుకొనే సూచనలన్నీ ఆ శుభవార్తలో బోధించబడ్డారు. ఆ వార్త వాస్తవమైనదిగా ప్రమాణీకరించడానికి దూతలు క్రీస్తును స్తుతించారు.
2. సరియైన నిర్ణయం తీసుకోవడం (15-16)
- ఇది నిజమా కాదా అని అనుమానించి ఉండొచ్చు, ఆ ఏముందిలే అని వదిలేసి ఉండొచ్చు కానీ ఆ వార్త దేవుడు తెలియజేసాడు అని నమ్మారు, విశ్వాసం చూపించారు.
- వారు త్వరగా వెళ్లి: అంటే ఇంకేమి ఆలోచించకుండా సరైన నిర్ణయంతో వెంటనే వెళ్లిపోయారు.
- మేము ఎదురు చూస్తున్న మా రక్షకుడు పుట్టాడంటా అని నమ్మి బయలువెళ్లారు. బహుశా గొర్రెలను వేరే కాపరులకు అప్పగించి ఉండొచ్చు.
3. సువార్త ప్రకటించడం (17-18)
- వారికి బోధించబడిన సువార్తను, అంటే క్రీస్తు గురించి దూతలు తెలియజేసిన సంగతులన్నీ ప్రచారం చేసారు.
- క్రీస్తు ఉన్న స్థలం దగ్గర ఉన్నవాళ్లకు, అలాగే వారికి మార్గంలో కనిపించిన వాళ్లందరకు ప్రకటించారు.
- ఎంతో ఉన్నతమైన రీతిలో చెప్పుంటారు అందుకే వారు చెప్పిన వార్తను విన్నవారందరూ ఆశ్చర్యపోయారు.
➤ దేవుని రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించడమే నిజమైన క్రిస్మస్.
4. స్తోత్రముచేయడం (20)
- సర్వోన్నతుడైన దేవుణ్ణి చూసారు. ఆ అద్భుతాన్ని చూసిన వారికి అంతకుముందెన్నడు లేని ఆనదం కలిగింది.
- వారు చూసి కనుగొన్న ఆ గొప్ప అద్భుతాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు.
- రక్షకుడిని చూసిన ఆ గొర్రెల కాపరులు దేవుని మహిమపరిచారు, స్తోత్రములు చెల్లించారు.
➤ క్రిస్మస్ తర్వాత క్యాలండర్ మార్చి క్రీస్తును మర్చిపోకూడదు. దేవుణ్ణి ఎల్లవేళలా మహిమపరుస్తూ ఉండాలి.
ముగింపు
గొర్రెల కాపరులకు ఉన్న ఇంకితజ్ఞానం చూసారా! ఎంత అర్థవంతంగా క్రీస్తు పుట్టుకను జరుపుకున్నారో. క్రీస్తును గూర్చిన శుభవార్తను విన్నారు. వెంటనే సరైన నిర్ణయం తీసుకొని క్రీస్తు దగ్గరకు వెళ్లారు. ఆ సువార్తను ఇతరులకు ప్రకటించారు. జరిగిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు.
మన క్రిస్మస్ కూడా అర్థవంతంగా, దేవుడు మెచ్చేలా ఉండాలంటే ఈ గొర్రెల కాపరులు క్రీస్తు పుట్టుకను జరుపుకున్న రీతిలో మనం కూడా జరుపుకుంటే సరిపోతుంది.
క్రిస్మస్ అనేది కేవలం సాంప్రదాయ వేడుక కాదు. ఇది మన జీవన విధానాన్ని, మన విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఒక అవకాశంగా ఉండాలి.
మనం జరుపుకొనే క్రిస్మస్ అర్థవంతమైందిగా ఉందా లేక అన్య ఆచారాలకు అనుగుణంగా ఉందా? ఆలోచించండి!
.webp)