వాక్యభాగం: మత్తయి 2:1-12
పరిచయం
జ్ఞానంలేని జీవనం, గమ్యం తెలియని ప్రయాణంలాంటిది, ఏటు పోతున్నామో తెలియదు. అందుకే అందరూ జ్ఞానవంతులుగా ఉండాలనే అనుకుంటారు కానీ ఎవరూ కూడా మూర్ఖులని అనిపించుకోడానికి ఇష్టపడరు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు చదువుకోవడం, శిక్షణ తీసుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం వంటి అనేక విధానాలలో కృషి చేస్తుంటారు. ఆ ప్రక్రియలో మేమే జ్ఞానులం, మాకే ఎక్కువ జ్ఞానం ఉంది అనే గర్వంతో విర్రవీగుతారు. ఇలాంటి వైఖరి కాలక్రమేణా చాలా అనర్ధాలకు దారితీస్తుంది.
కాబట్టి జ్ఞానం సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో, జ్ఞానం కలిగి జీవించడం కూడా అంతే ముఖ్యం, అదే నిజమైన జ్ఞానం. అలా జ్ఞానాన్ని ప్రదర్శించి జ్ఞానదాతను చేరుకున్న కొందరు జ్ఞానుల నుండి, నిజమైన జ్ఞానులు ఎవరు? వారేమి చేస్తారు? అనే విషయాలను ధ్యానించుకుందాం.
తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు?
ఈ జ్ఞానులు ఎంతమందో అని బైబిల్లో చెప్పబడలేదు. అయితే, వారు ఇచ్చిన మూడు కానుకలను ఆధారం చేసుకొని, వారు ముగ్గురు అయ్యుండొచ్చు అని భావించడం సాధారణం. కానీ వారి సంఖ్యను గూర్చిన చర్చ అంత ప్రాముఖ్యం కాదు.
ఈ జ్ఞానులు ఖగోళశాస్త్రంలో, తారల అధ్యయనంలో నిపుణులు. తారల ద్వారా దేవుని సంకేతాలను తెలుసుకునే వ్యక్తులుగా మనం చూస్తున్నాం.
వీరు తూర్పు దేశం నుండి వచ్చారని బైబిల్లో పేర్కొనబడింది (మత్తయి 2:1). ఈ తూర్పు దేశం ప్రాచీన బబులోను, పారసీక, లేదా అరేబియా ప్రాంతం కావచ్చని చాలామంది చరిత్రకారులు విశ్వసిస్తారు.
ప్రసంగం
1. దేవునికై అశగలవారు | God desired - (1-9)
A. ఆశతో వెదకడం
- దేవుణ్ణి చూడడానికి ఆశతో సుదూర ప్రయాణం చేశారు.
- లేఖనాలలోని ప్రవచనాలను ధ్యానించారు (సంఖ్యా 24:17; మీకా 5:2).
- దేవుణ్ణి వెదకడంలో చాలా ప్రయాసపడ్డారు. మనం కూడా దేవుణ్ణి వివేకంతో వెతకాలి (కీర్తన 53:1-2).
B. ఆశతో విచారించడం
- రాజైన హేరోదు దగ్గరకు వెళ్లి క్రీస్తు గురించి విచారించారు.
- శాస్త్రులతో, యాజకులతో కూడా సమాచారం కోసం విచారించి ఉంటారు.
- వారు నక్షత్రాన్ని చూసిన కాలాన్ని కూడా విచారించారు.
C. ఆశతో వీక్షించడం
- వారు దేవుణ్ణి చేరే ప్రయాణంలో ఎంతో ఎదురు చూసి ఉంటారు.
- తారను అనుసరించి దేవుని కనుగొన్నారు (మత్త 1:9).
- ఆ తారను కనిపెట్టుకొని అన్ని మైళ్ల దూరం, అన్ని రోజులు ఎంతగా వీక్షించారో.
➤ నిజమైన జ్ఞానులుగా ఉండాలంటే దేవునికై అశగలవారమై ఉండాలి.
➤ దేవుణ్ణి చేరుకోవాలని, దేవునితో సమయం గడపాలనే కోరిక కలిగుండాలి (కీర్తన 27:4).
2. దేవునిని అరాధించేవారు | God devoted - (11)
A. ఆరాధన విలువైనదిగా ఉండాలి
- వారి దేశం నుండి విలువైనవి తెచ్చారు.
- వారి కానుకలు రాజుకు సమర్పించే అంత ఉన్నతమైనవి.
- వారు ఎంతో ప్రయాసతో ఆ కానుకలు క్రీస్తు కొరకు భద్రంగా తెచ్చారు.
B. ఆరాధన అర్థవంతమైనదిగా ఉండాలి
- బంగారం: క్రీస్తు రాచరికానికి సూచిస్తుంది
- సాంబ్రాణి: క్రీస్తు దైవత్వానికి సూచిస్తుంది
- భోళము: క్రీస్తు శ్రమలకు, మరణాన్ని సూచిస్తుంది
➤ నేటి సంఘం ఇచ్చే కానుకలు ఎలా ఉన్నాయో చూడండి!
➤ మరి నువ్విచ్చే కానుక ఎలాంటిది?
C. ఆరాధన నిజమైనదిగా ఉండాలి
- వారు క్రీస్తుకు ఇచ్చిన కానుకలు నిజమైనవి.
- వారు క్రీస్తుకు చేసిన ఆరాధన పరిపూర్ణమైనది.
- ఆ జ్ఞానులు మరియను పూజించలేదు. కానీ మరియనే క్రీస్తును ఆరాధించింది (అపో.కా 1:46; లూకా 1:46). మరియలో ఎటువంటి దైవత్వం లేదు. మరియ కేవలం దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి పాత్ర మాత్రమే.
➤ మీ ఆరాధన దేవునికి తప్ప మరెవరికి ఇచ్చినా విగ్రహారాధికులౌతారు (నిర్గమ 20: 3,4).
➤ నీ అర్పణ: నీ విలువైన ఆత్మనూ, హృదయాన్ని దేవునికి ఇవ్వడం
3. దేవునిని అనుసరించేవారు | God directed - (12)
A. దేవుని మాట విన్నారు
- వారు జ్ఞానులైనప్పటికీ దేవుని మాట విన్నారు.
- దేవుని సూచనను గమనించి, దానికి తగిన విధంగా స్పందించారు.
B. దేవునికి విధేయత చూపారు
- వారు వినడం మాత్రమే కాదు, విధేయత కూడా చూపించారు.
- జ్ఞానులము కదా, మాకు తెలుసు అనుకోలేదు.
- సర్వజ్ఞాని అయిన దేవునికి లోబడ్డారు.
C. దేవుడు అనుసరించి వెళ్ళిపోయారు
- దేవుని మాటను అనుసరించి ఆయన బోధించిన మార్గాన వెళ్లిపోయారు.
- హేరోదుకు చెబితే బహుమతులు వస్తాయి అనుకోలేదు.
- ఒకవేళ వాళ్లు హేరోదు దగ్గరకు వెళ్లుంటే, హేరోదు వారిని చంపేవాడు.
➤ దేవుని మాట వినకపోతేనే మనకు ప్రమాదం పొంచి ఉంటుంది.
➤ దేవుని మాటను వినాలి ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడడానికే బోధిస్తాడు.
ముగింపు
సర్వజ్ఞాని అయిన దేవునిని చేరుకోవడం మాత్రమే నిజమైన జ్ఞానం. మనం నిజమైన జ్ఞానులుగా ఉండాలంటే, దేవునికై ఆశగలవారమై ఉండాలి, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించాలి, ఆయన మార్గాలను అనుసరించాలి. ఈ విధంగా జీవించినప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానులు అవుతాం.
నువ్వు నిజమైన జ్ఞానివిగా మారాలనుకుంటున్నావా? నిజమైన జ్ఞానం పొందాలనుకుంటున్నావా? అయితే దేవునియందు భయభక్తులు కలిగి జీవించు (సామెత 9:10).
.webp)