దేవుని చిత్తము అంటే ఏమిటి? | What is God's Will?

0

Illustration of Jesus guiding a man in formal attire toward a mountain path, symbolizing spiritual direction and purpose.

మన జీవితంలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనేటప్పుడు లేదా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు, ఉత్తమమైన మార్గాన్ని, మేలైన సహకారాన్ని ఆశిస్తాం. అటువంటి సమయాల్లో 'దేవుడు నన్ను ఏమి చేయమంటున్నాడు?', 'నేను సరైన మార్గంలో ఉన్నానా?', లేదా 'నా నిర్ణయం సరైనదేనా?' అనే ప్రశ్నలు మన మనసులో అల్లకల్లోలాన్ని రేపుతాయి. అప్పుడే ఆసలు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలనే ఆరాటం పెరుగుతుంది. 


దేవుని చిత్తము అంటే ఏమిటి? | What is God's Will?

దేవుని చిత్తము అంటే దేవునికి నచ్చినది, ఆయనకు ఇష్టమైనది, ఆయన కోరుకొనేది, ఆయన ఉద్దేశించేది. "దేవుని చిత్తము" ఈ సృష్టి, సమస్త మానవాళి, మరి ముక్యంగా క్రీస్తునందు విశ్వాసముంచిన వారి వ్యక్తిగత జీవితాల కొరకు దేవుడు కలిగున్న  ప్రణాళికను, ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ఆయన చిత్తం బైబిల్ గ్రంథంలో బయలుపరచబడింది. 

లేఖనాలు దేవుని చితాన్ని తెలియజేస్తాయి (1 తిమో 2:4, 1 థెస్స 4:3). దేవుని చిత్తము ఆయన వాక్యములో ప్రత్యక్షపరచబడింది, అందులో మనము ఏమి విశ్వసించాలో, ఏమి చేయాలో నిర్దేశించబడ్డాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రస్పుటంగా బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటే, అది మనకు కావలసిన మార్గానిర్దేశాన్నిస్తూ, దేవుని అంతిమ ఉద్దేశాల వైపు నడిపిస్తుంది

గమనించాలి: దేవుడు బయలుపరిచిన చితాన్ని చేస్తుంటే అప్పుడు మన వ్యక్తిగత జీవితం పట్ల ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొనే మార్గం వైపు నడిపిస్తాడు.

కానీ దేవుని చిత్తాన్ని క్రీస్తునందు విశ్వాసముంచి, నిజంగా రక్షణపొందినవారు మాత్రమే తెలుసుకోగలరు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే రక్షణపొంది, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, వాక్యానుసారంగా జీవింస్తుండాలి. జాన్ మకార్థర్ (John MacArthur) అనే దైవసేవకుడు ఏమంటాడంటే, "దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందుగా రక్షణ పొందినవారమై ఉండాలి, అలాగే ఆత్మపూర్ణులై ఉండాలి". (Found: God's Will, 2012, 17). 

4 రకాల దేవుని చిత్తం/4 Aspects of God’s Will

దేవుని చిత్తాన్ని అంటే ఏంటో తెలుసుకోడానికి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకు 4 రకాలైన దేవుని చిత్తం కనిపిస్తుంది. 

1. దేవుని సార్వభౌమ చిత్తం / God’s Sovereign Will, అనేది దేవుడు సృష్టిని, దానిలోని సమస్తాన్ని ఆయన అధికారం క్రింద నిర్వహిస్తూ, అన్నీ సంఘటనలను ఆయన ఆధీనంలో జరిగించే మార్పు చెందని ప్రణాళిక (దాని 4:35; ఎఫె 1:11). 

2. దేవుడు బయలుపరిచిన చిత్తం / God’s Revealed Will, అనేది మనము జీవించడానికి కావలసిన నైతిక విలువలను, ఆచరించాల్సిన నీతియుక్తమైన నియమాలను ఆయన పరిశుద్ధ లేఖనాలలో  స్పష్టంగా తెలియజేయడం (ద్వితీ 29:29).  

3. దేవుడు నడిపించే చిత్తం / God's Directive Will, అనేది దేవుడు తన పిల్లల జీవితాలను ప్రత్యేకమైన మార్గంలో ఆయన యొక్క ఉద్దేశ్యాలకు అనుగుణంగా నడిపించడం (సామె 3:5-6). 

4. దేవుడు అనుమతించే చిత్తం / God’s Permissive Will, అనేది మన నిర్ణయాలను, చర్యలు పాపానికి లేదా శ్రమలకు దారితీసినప్పటికీ దేవుడు తన సార్వభౌమత్వంలో వాటిని అనుమతించడం (అపో. కా 14:16; రోమా 8:28). 

దేవుని చిత్తము గురించిన బైబిల్ వచనాలు | Bible Verses About God's Will

దేవుని చిత్తాన్ని నిర్వచించే మరియు వివరించే కీలకమైన బైబిల్ వచనాలు:

రోమీయులు 12:2: "మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి."

యిర్మీయా 29:11: "నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు."

ఎఫెసీయులు 5:17: "ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి."

మీకా 6:8: "మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు."

యాకోబు 4:15: "కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను."

యోహాను 6:40: "కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును."

ముగింపు 

దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనకు ఆత్రంగా ఉన్నా కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే, చాలామంది ఊహించేలా దేవుని చిత్తం అంటే ఏదో మార్గాన్ని చూపించే దిక్సూచి అయితే కాదు లేదా మనం చేయవలసినవి, చేయకూడనివి తెలియజేసే నియమాలతో నిండిన పట్టిక కూడా కాదు. దేవుని చిత్తం మన జీవితాలను, హృదయాలను దేవునితో విలీనం చేసే ఆత్మీయ సంబంధం. దేవుని చిత్తం తెలుసుకోడం అంటే ఏదో సాహసకృత్యమైన గమ్యాన్ని చేరడం కాదు దేవుని సహవాసంలో సాగే మన జీవిత గమనం. 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !