6 interesting things about Dr.Voddie Baucham/డా.వోడ్డీ బౌకమ్ గురించి తెలుసుకోవాల్సిన 6 విషయాలు

0

 

A black and white photo of Voddie Baucham speaking at a podium. The text on the image reads, "Sometimes God is glorified when sick saints get well. But more often than not, God is glorified when sick saints die well.

పాస్టర్, రచయిత మరియు థియోలాజియాన్ అయిన వోడ్డీ టి. బౌకమ్ జూనియర్, ఆధునిక క్రైస్తవ సువార్తికులలో అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద వ్యక్తులలో ఒకరు. ఆయన బోధలు, రచనలతో లక్షలాది మందిని ప్రభావితం చేశాడు. ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన ఆరు ముఖ్యమైన విషయాలు చూద్దాం.


1. ఫుట్‌బాల్ నుండి పుల్పిట్

పాస్టర్ అవ్వకముందు, బౌకమ్ ఒక గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అయన 1987లో కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు క్రైస్తవ్యానికి వచ్చాడు. క్రైస్తవ విశ్వాసాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన క్రీడలను విడిచిపెట్టి వేదాంత విద్యను అభ్యసించాడు. ఆయన హోస్టన్ బాప్టిస్ట్ యూనివర్సిటీ (Houston Baptist University) నుండి క్రిస్టియానిటీ మరియు సోషియాలజీలలో బ్యాచిలర్ డిగ్రీలను, సౌత్‌వెస్టర్న్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ (Southwestern Baptist Theological Seminary) నుండి మాస్టర్ ఆఫ్ డివినిటీ (M.Div.), మరియు డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ (D.Min.) డిగ్రీలను పొందాడు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో (University of Oxford) కూడా పోస్ట్-గ్రాడ్యుయేట్ చదువుకున్నారు. 


2. విశ్వాసంలో ఆయన మేధోపరమైన ప్రయాణం

బౌకమ్ క్రైస్తవ కుటుంబంలో పెరగలేదు. ఆయన కాలేజీలో ఉన్నప్పుడే సువార్తను మొదటిసారి విన్నాడు. ఆయన విశ్వాస ప్రయాణం ఒక మేధోపరమైనది. తన మొదటి కుమార్తె పుట్టినప్పుడు ఆమెపై తనకు కలిగిన ప్రేమను చూసి, తన తండ్రి తనను ఎందుకు విడిచిపెట్టాడని ఆయన ప్రశ్నించుకోవడం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. ఈ వ్యక్తిగత అనుభవం ఆయన తరువాతి దినాలలో సాంస్కృతిక అపొలజిటిక్స్‌కు (Cultural Apologetics) పునాది అయ్యింది, బైబిల్ దృక్పథం ఆధారంగా లౌకిక ప్రపంచ ఆలోచనలను ఎదుర్కోవడానికి ఆయనకు వీలు కల్పించింది.


3. సేవా పరిచర్యలు

1993లో వోడ్డీ బౌకమ్ మినిస్ట్రీస్‌ను స్థాపించి, అనేక సంవత్సరాలు సువార్తికుడిగా సేవ చేశాడు. ఆ తర్వాత టెక్సాస్‌లోని గ్రేస్ ఫ్యామిలీ బాప్టిస్ట్ చర్చ్కి (Grace Family Baptist Church) పాస్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2015లో జాంబియాలోని లుసాకాలోని ఆఫ్రికన్ క్రిస్టియన్ యూనివర్సిటీలో (African Christian University) డీన్ ఆఫ్ థియాలజీగా (Dean of Theology) దాదాపు పదేళ్లపాటు సేవ చేశాడు. ఆఫ్రికాలో తన సేవ తర్వాత, 2024లో ఆయన అమెరికాకు తిరిగి వచ్చి, ఫ్లోరిడాలోని ఫౌండర్స్ సెమినరీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.


4. కుటుంబమే శిష్యరికానికి ప్రధాన కేంద్రం

బౌకమ్ బోధల ప్రకారం, కుటుంబం దేవునిచే ఏర్పాటు చేయబడిన ఆత్మీయ శిక్షణ కేంద్రం. ఆయన పుస్తకం ఫ్యామిలీ డ్రివెన్ ఫెయిత్లో (Family Driven Faith: Doing What It Takes to Raise Sons and Daughters Who Walk with God) తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు, తమ పిల్లల ఆధ్యాత్మిక అభివృద్ధికి బాధ్యత వహించాలని ఆయన వాదించాడు. ఈ నమ్మకం ఆయనను హోమ్‌స్కూలింగ్ మరియు కుటుంబ-కేంద్రీకృత చర్చిలను ప్రోత్సహించేలా చేసింది.


5. విమర్శల పాలైన బెస్ట్ సెల్లర్

బౌకమ్ పుస్తకాలలో ప్రసిద్ధిచెందిన పుస్తకం, ఫాల్ట్ లైన్స్ (Fault Lines: The Social Justice Movement and Evangelicalism's Looming Catastrophe), ఒక బెస్ట్ సెల్లర్‌ పుస్తకంగా నిలిచింది. ఈ పుస్తకంలో, సామాజిక న్యాయం (social justice) ఉద్యమం క్రైస్తవత్వంతో సరిపోలని ఒక "పోటీ ప్రపంచ దృక్పథం" (competing worldview) అని ఆయన వాదించారు. ఈ పుస్తకం ప్రశంసలు, కాపీరైట్ (plagiarism) ఆరోపణలు రెండింటినీ అందుకుంది.


6. అచంచలమైన విశ్వాస వారసత్వం

తీవ్రమైన గుండె జబ్బుతో పోరాడినప్పటికీ, ఆయన తన పరిచర్యను కొనసాగించారు. 2024లో అమెరికాకు తిరిగి వచ్చి, ఫౌండర్స్ సెమినరీ (Founders Seminary) వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అటుతరువాత 2025 సెప్టెంబర్ 25న 56 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. ఆయన బోధలు, పుస్తకాలు, ముఖ్యంగా బైబిల్ పురుషత్వం, కుటుంబ శిష్యరికం వంటి విషయాలపై ఆయన చేసిన కృషి ఆయన వారసత్వాన్ని సజీవంగా ఉంచుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !