12+ యేసుక్రీస్తు అపొస్తలులు | 12+ Apostles of Jesus Christ

0

AI generated artistic depiction of the twelve apostles, each with distinct colored robes and halos, standing in a reverent pose.

యేసుక్రీస్తు ఎన్నుకున్న ఆదిమ అపొస్తలులు క్రైస్తవ చరిత్రలో, క్రొత్త నిబంధన రచించడంలో కీలకమైన పాత్ర పోషించారు. వీరు ఆదిమ క్రైస్తవ సంఘానికి పునాది వేసి, సంఘాభివృద్దికై ఎడతెగని కృషితో పరిచర్య చేశారు.  క్రీస్తు సువార్త, ఆయన బోధలు ప్రపంచ నలుమూలలకు వ్యాప్తిచెందడానికి ప్రాణాలు ఫలంగా పెట్టి లోకానికి సువార్త చాటి చెప్పారు. అపొస్తలుల జాబితా మార్కు 3:16-19; లూకా 6:13-16; ఆపొ. కా 1:13 లో వ్రాయబడింది. ఈ అపొస్తలుల పరిచర్య జీవితాల గురించిన కనీస అవగాహన కూడా మనలను క్రీస్తుకు నమ్మకమైన, నిజమైన శిష్యులుగా ఉండటానికి ప్రేరేపిస్తుంది.  


పేతురు పేతురును సీమోను అని కూడా పిలిచేవారు. పేతురు బెత్సైదా అనే గ్రామానికి చెందిన ఒక జాలరి. కొంచం తొందరపాటు కలిగినప్పటికీ ఎక్కువ ఆశక్తి కలవాడు. యేసుకు అతి సన్నిహితంగా ఉన్న 3 శిష్యులలో పేతురు ఒకడు. తరచుగా అపొస్తలుల తరపున మాట్లాడేవాడు. క్రీస్తు మరణ పునరుత్థానాల తరువాత, ఆదిమ సంఘాన్ని స్థాపించడంలో పేతురు కీలకమైన పాత్ర పోషించాడు. ముక్యంగా యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. నీరో చక్రవర్తి ద్వారా రోమా పట్టణంలో తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు, ఎందుకటే యేసుక్రీస్తు వలె సిలువవేయబడటానికి అర్హుడు కాదని భావించాడు. ఆంధ్రెయ ఆంధ్రెయ సిమోను పేతురు యొక్క సోదరుడు, పేతురు లాగే చేపలు పట్టేవాడు. యేసును అనుసరించిన మొదటి శిష్యుడు ఆంధ్రెయ. యేసుక్రీస్తే మెస్సీయా అని పేతురుకు చెప్పింది ఆంధ్రెయానే. ఆంధ్రెయ యొక్క పరిచర్య గ్రీకు దేశం మరియు చిన్న ఆసియా వరకు విస్తరించినట్లు సంప్రదాయాలు సూచిస్తున్నాయి. పట్రాస్ అనే గ్రీకు పట్టణంలో X- ఆకారపు సిలువపై సిలువేయబడ్డాడు, ఆ సిలువపైనే 3 దినాలు వేలాడుతూ క్రీస్తు గురించి ప్రకటిస్తూనే మరణించాడు. ఆ సిలువను ప్రస్తుతం “సెయింట్ ఆండ్రూస్ క్రాస్” అని పిలుస్తారు. యాకోబు యాకోబు చేపలు పట్టుకొనే జాలరి మరియు యేసు శిష్యులలో కీలక వ్యక్తి. క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఆ కొండపై పేతురు, యోహానులతో పాటు యాకోబు కూడా ఉన్నాడు. యాకోబు యెరూషలేము మరియు యూదయ చుట్టూ పరిచర్య చేశాడు. క్రీ.శ.44 లో హేరోదు ద్వారా ఖడ్గముతో చంపించబడ్డాడు. తమ విశ్వాసం కోసం హత్యసాక్షి అయిన అపొస్తలులలో యాకోబు మొదటివాడు. యేసు శిష్యులలో యాకోబు మరణం గురించి మాత్రమే బైబిల్లో రాయబడింది (అపొ. కా.12:2). యోహాను యోహాను, యాకోబు యొక్క సోదరుడు మరియు చేపలుపట్టే జాలరి. యేసుక్రీస్తు యొక్క "ప్రియమైన శిష్యుడు"గా ఉన్నాడు మరియు స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ సంఘాలను స్థాపించాడు. అపోస్తలులలో యోహాను ఒక్కడు మాత్రమే హత్యసాక్షి కాకుండ సహాజమైన మరణం పొందాడు. బాగా మరుగుతున్న నూనెలో వేసినప్పటికి అధ్బుతంగా ఏ గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఆ తర్వాత పత్మాసు ద్వీపంలో చెరసాలలో వేయబడ్డాడు. ఫిలిప్పు ఫిలిప్పు బెత్సైదా గ్రామానికి చెందినవాడు. యేసు మొదటిగా పిలిచిన శిష్యులలో ఫిలిప్పు ఒకడు. అలాగే నతానియేలును క్రీస్తు యొద్దకు తీసుకొచ్చాడు. ఫిలిప్పు క్రీస్తు సువార్తను పంచుకుంటూ చిన్న ఆసియా పరిచర్య చేసి ఉండవచ్చు. ఫిలిప్పు ప్రగియాలోని హెలిపోలీస్ అనే ప్రాంతంలో హత్యసాక్షి అయ్యాడు. ఫిలిప్పును కొరడాలతో కొట్టి, చెరసాలలో వేసి, తర్వాత క్రీ.శ.54 లో సిలువేశారు. బర్తొలొమయి బర్తొలొమయి యోహాను సువార్తలో పేర్కొనబడిన నతానియేలు. బర్తొలొమయి ఒక పండితుడు. అనేక దేశాలలో సువార్త ప్రకటించాడు. మత్తయి సువార్తను భారతదేశ భాషలోకి అనువాదించి అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించాడు. సహించలేని విగ్రహారాదికులు క్రూరంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సిలువేశారు. మత్తయి మత్తయి వృత్తిపరంగా పన్ను వసూలు చేసేవాడు కానీ యేసు పిలుపుకు స్పందించి అపొస్తలుడయ్యాడు. యేసు జీవితం మరియు బోధలను తన సువార్త పత్రికలో రాశాడు. మత్తయి పార్థియ, ఇథియోపియా ప్రాంతాలలో పరిచర్య చేశాడు. తర్వాత ఇథియోపియాలో అనేక శ్రమలు పొంది, క్రీ.శ.60 లో నాధాబా అనే పట్టణంలో శూలం లాంటి ఆయుధం చేత చంపబడి హత్యసాక్షి అయ్యాడు. తోమా తోమాకు ఉన్న మరో పేరు దిదోమి. యేసు పునరుత్థానుడైన తరువాత ఆయన గాయంలో వెలుపెట్టి చూసాడు. ప్రారంభంలో సందేహం కాలవాడైనప్పటికీ తరువాత క్రీస్తు పట్ల దృడమైన విశ్వాసాన్ని చూపించాడు. తోమా తన సువార్త పరిచర్యను పార్థియ మరియు భారతదేశంలో చేశాడు. భారతదేశంలో అన్యమత పూజారులు ఈటెతో పొడిచి చంపడం ద్వారా క్రీ.శ.53 లో హతసాక్షుడయ్యాడు. యూదా ఇస్కారియోతు యేసుక్రీస్తు శిష్యులలో యూదా ఇస్కారియోతు ఒక ద్రోహి. ముప్పై వెండి నాణేల కోసం మతాధికారులకు యేసును అప్పగించాడు. ఆ తరువాత అపరాధ భావంతో తనకుతానుగా ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఆల్ఫయి కుమారుడైన యాకోబు ఆల్ఫయి కుమారుడైన యాకోబు “జేమ్స్ ది లెస్” అని కూడా పిలువబడ్డాడు. ఈయన యేసుక్రీస్తు సోదారుడని కొన్ని సంప్రధాయలు భావిస్తాయి. యాకోబు, యేసుకు నమ్మకమైన అనూచారుడిగా ఉండి యెరుషాలేములో పరిచర్య చేస్తూ అక్కడ ఆదిమ క్రైస్తవ సంఘాన్ని స్థాపించడంలో కారకుడయ్యాడు అలాగే క్రొత్త నిబంధలోని యాకోబు పత్రిక రచించాడు. చివరకు క్రీస్తు పట్ల తన స్థిరమైన విశ్వాసం కొరకు రాళ్లతో కొట్టబడి హత్యసాక్షి మరణాన్ని పొందాడు. తద్దయియను మారుపేరుగల లెబ్బయి తద్దయి, లెబ్బయి అనీ, యూదా అని కూడా పిలువబడ్డాడు. ఈయన యేసు క్రీస్తు సహోదరుడు అలగే క్రొత్త నిబందనలోని యూదా పత్రిక రచయితగా గుర్తించబడ్డాడు. మెసొపొటేమియాలోని కొన్ని ప్రాంతాలలో సువార్తను బోధించాడని నమ్ముతారు. జెలోతే అనబడిన సీమోనుతో కలిసి సువార్త ప్రకటన చేశాడు. యేసు బోధనలను వ్యాప్తిచేస్తూ పారసీక దేశంలో క్రీ. శ.65 లో హతసాక్షిగా మరణించాడు. జెలోతే అనబడిన సీమోను ఈ సీమోను రోమీయుల పాలన నుండి యూదుల స్వాతంత్ర్యం కోసం వాదించే జెలోతీయుల ఉద్యమంతో సంబంధం కలిగివాడు. ఆఫ్రికాలో, మౌరిటానియలో, బ్రిటన్ లో కూడా సువార్తను ప్రకటించాడు. అతను పారసీక దేశ ప్రాంతాలలో క్రీస్తు గురించి బోధిస్తూ, ఆపై అక్కడ అపొస్తలుడైన తద్దయితో సువార్త ప్రకటించుంటాడాని చాలామంది నమ్ముతారు. అటుతరువాత క్రీ.శ.74 లో గొడ్డలితో సగానికి నరకబడి హతసాక్షుడయ్యాడు. మత్తీయ యూదా ఇస్కారియోతు మరణం తర్వాత ఒక అపోస్తులుడి స్థానం ఖాళీగా మిగిలిపోయింది. అపొస్తలుల కార్యములు 1:15-26లో వివరించిన విధంగా చీట్లు వేయడం ద్వారా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మత్తీయ ఎంపికయ్యాడు. యెరూషలేములో, యేసు పునరుత్థానం మరియు ఆరోహణానికి సాక్ష్యమిస్తూ పరిచర్య చేశాడు. యెరుషాలేములో రాళ్ళతో కొట్టబడి, శిరస్సు ఖండిచబడి హత్యసాక్షిగా మరణించాడని ఎక్కువ మంది నమ్ముతారు. పౌలు అపొస్తలుడైన పౌలు, అసలుగా సౌలు అని పిలువబడే ఒక పరిసయ్యుడు. ఆదిమ క్రైస్తవులను హింసిస్తున్న ప్రక్రియలో దమస్కు మార్గంలో వెళ్తుండగా పునరుద్ధానుడైన క్రీస్తును ఎదుర్కొనడం వలన తన జీవితం మార్పుచెందింది. క్రొత్త నిబంధనలో అనేక ఎక్కువ భాగం పుస్తకాలకు రచయిత అయ్యాడు. పౌలు పరిచర్య రోమా సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న చిన్న ఆసియా నుండి గ్రీసు మరియు రోమా వరకు విస్తరించింది. ఆ ప్రాంతాలలో క్రైస్తవ సంఘాలను స్థాపిస్తూ, సువార్త బోధిస్తూ, సంఘాభివృద్ధికై ప్రయాసపడ్డాడు. సుమారుగా క్రీ.శ.64 లో రోమా పట్టణంలో శిరస్సు ఖండించబడి హత్యసాక్షి అయ్యాడు. ముగింపు అపొస్తలుల జీవితాలు, వారి పరిచర్యలు యేసుక్రీస్తూ బోధలు అన్నీ కాలాలలో నిరంతరం ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయనడానికి నిదర్శనం. వారి అత్యంత సాధారమైన జీవితాలు లోకం నలుమూలలా సువార్తను వ్యాప్తిచేసి ప్రపంచాన్ని ప్రభావితం చేసాయి. వారు కలిగిన విశ్వాసం, సమర్పణ ఇంకా మరణాన్ని కూడా లెక్కచేయకుండా దేవుని పనికై నిలబడడం ఈనాటికీ క్రైస్తవులకు స్ఫూర్తినిస్తూనే ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !